KRNL: ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రెటరీగా పనిచేసి కర్నూలు జాయింట్ కలెక్టర్గా నియమితులైన నూరుల్ కమర్ శనివారం కలెక్టరేట్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం నూతన జేసీకి అధికారులు పుష్పగుచ్చం అందజేసి, అభినందనలు తెలిపారు.