BHPL: గణపురం, రేగొండ మండల కేంద్రాల్లో శనివారం MLA గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. ఈ క్రమంలో MLA ఇటీవల పలు కారణాలతో మరణించిన కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. MLA గండ్ర మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.