SRD: పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో స్వల్పంగా వరద చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వస్తోందని అధికారులు మంగళవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 TMC లు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో19.372 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ ప్లో 680, అవుట్ ప్లో 540 క్యూసెక్కులు దిగువకు పారుతున్నాయని తెలిపారు.