KNR: సీఎం కప్ పోటీలలో భాగంగా కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జూడో రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించే ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పిస్తూ సంతాపం ప్రకటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోటీలను ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్ ప్రారంభించారు.