SRD: ఓటు వేసి తిరిగి వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి(D) మసాన్పల్లి బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై గురవారం జరిగింది. శంకరంపేట్(M) అరేపల్లికి చెందిన వెంకటేశ్ ప్రస్తుతం నస్రుల్లాబాద్(M) బస్వాయిపల్లిలో ఉంటున్నాడు. ఓటు వేసేందుకు అరేపల్లికి వెళ్లి తిరిగి బస్వాయిపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.