SRPT: ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన సంఘటన గురువారం మునగాల మండలం కృష్ణానగర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు గుండ్లపలి నర్సిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ద్విచక్ర వాహన ఉంచి నిద్రకు ఉపక్రమించగా గుర్తు తెలియని వ్యక్తులు గేట్ నుండి ఇంట్లోకి చొరబడి ద్విచక్ర వాహనాన్ని అపహరించినట్లు తెలిపారు.