ADB: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు మీడియా కీలకపాత్ర పోషిస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మీడియాలో ప్రచురితమయ్యే సమాచారం న్యాయపరంగా, నియమ నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్ పై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు.