KMM: ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంలో ఉన్నతంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం ఖిల్లా రోప్ వే నిర్మాణ ప్రాంతం, జాఫర్ బావి మరింత సుందరీకరణ పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి, చేపట్టాల్సిన పనుల గురించి పరిశీలించారు. అనంతరం రోప్ వే నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.