PDPL: గోదావరిఖని పట్టణం కృష్ణానగర్‌కు చెందిన కుమారస్వామితో పాటు భాస్కర్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇంటి వద్దనే ఈ ఘటన జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామి, భాస్కర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.