JGL: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పరిశీలించుటకు గురువారం ఆయన మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట కమిషనర్ మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మి, డిప్యూటీ ఈఈ నాగేశ్వరరావు, టీపీఓ రాజేంద్రప్రసాద్, టీపీఎస్ అశోక్ తదితరులు ఉన్నారు.