MDK: సత్య సాయి సంస్థల సేవలు అమోఘమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సత్య సాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు బ్లాంకెట్లు, మహిళ చిరు ఉద్యోగులకు చీరలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలతో ముందుకు రావాలని కలెక్టర్ సూచించారు.