GDWL: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో పడి అదుపుతప్పి కింద పడడం వల్ల అనేక సందర్భాల్లో వాహనదారులు గాయాలపాలైనప్పటికీ రోడ్డును మాత్రం మరమ్మతు చేయకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులకు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.