WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ పండగ నిర్వహణ సందిగ్ధంలో పడింది. కొన్ని గ్రామాల్లో సోమవారం పండగ జరపాలని, మరికొన్నిచోట్ల మంగళవారం నిర్వహించాలని పండితులు చెబుతున్నారు. క్యాలెండర్లో దుర్గాష్టమి మంగళవారం ఉన్నప్పటికీ, సోమవారమే జరపాలని కొందరు సూచిస్తున్నారు. దీంతో మహిళల్లో అయోమయం నెలకొంది. దసరా నిర్వహణ సైతం సందిగ్ధంలో పడింది.