NZB: జక్రాన్ పల్లి మండలం బాల్ నగర్ వద్ద కామారెడ్డి కి భగీరథ నీటిని తీసుకెళ్లే పైప్లైన్ పగిలి నీరు వృధాగా వెళ్తుంది. మిషన్ భగీరథ అధికారులు తక్షణమే పైప్ లైన్ లీకేజీ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పైపు లైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృధాగా వెళ్లడంతో కామారెడ్డి జిల్లాకు తాగునీరు తగినంతగా వెళ్లడం లేదు. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.