SDPT: గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు శుక్రవారం హైదరాబాద్లోని కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరం లో భద్రాచలం ముక్కోటి ఏకాదశి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈమేరకు ఆయన ఆలయంలో పూజలు చేసి ఆలయ ట్రస్ట్ బోర్డుకు ముక్కోటి ఏకాదశి ఆహ్వానం పలికారు. అనంతరం రామకోటి రామరాజుకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో లావణ్య ఉన్నారు.