JGL: మెట్పల్లి శివారులోని వేంపేట్ రోడ్డులోని BC హాస్టల్ ముందు మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టాటా ACE, ద్విచక్రవాహనం ఢీకొనగా వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సీవుంది.