BDK: బూర్గంపాడు మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన పెరమళ్ళ అరవింద్ తల్లి పెరమళ్ళ రమణ ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాల మహానాడు పినపాక నియోజకవర్గ ఇంఛార్జ్ పిల్లి రవివర్మ ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మహానాడు ఆధ్వర్యంలో తమ వంతు సహాయంగా 50 కేజీల బియ్యం వితరణ చేశారు.