SDPT: చేర్యాల పట్టణానికి చెందిన కల్లు గీత కార్మికుడు బురగోని శ్రీనివాస్ గౌడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (KANA) ఆధ్వర్యంలో రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని KGKS జిల్లా నాయకుడు బండకింది అరుణ్ సమన్వయంతో కుటుంబానికి అందించారు. KANA ప్రతినిధులకు గౌడ సంఘం ధన్యవాదాలు తెలిపింది.