KMR: భిక్కనూర్ మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గిద్ద హరిజనవాడలోని కుసలకంటి బుచ్చయ్యకు చెందిన పెంకుటిల్లు తెల్లవారుజామున కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఇంటిని పరిశీలించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలి బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు.