MDK: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సుతార్ పల్లి గ్రామ శివారులో శివాయిపల్లి గ్రామానికి చెందిన కనకరాజు అనే వ్యక్తి రోడ్డు పక్కన నీటి కాలువలో పడి మృతి చెందారు. ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.