ADB: రెండు రోజుల క్షేత్ర పర్యటనకు ఐటీడీఏ ఉట్నూర్కి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ల బృందం (20 మంది అధికారుల బృందం) శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఉద్యాన నర్సరీ, శిక్షణ కేంద్రాన్ని (HNTC) సందర్శించారు. నర్సరీలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఐటీడీఏ ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ అధికారుల బృందానికి వివరించారు.