KNR: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి.. చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.