HNK: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భీమదేవరపల్లిలోని రైతు వేదికలో కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి ఆదివారం మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.