NLG: మూసీ ప్రాజెక్టుకు వరద పెరిగింది. శనివారం 96.09 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ప్రస్తుతం 369.09 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642.94 అడుగులు ఉంది. మూసీ ప్రాజెక్టు పూర్తి నీటిమట్ట సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.92 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారి మధు తెలిపారు.