HYD: ఈ వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్ సమర్థవంతంగా తట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు TGSPDCL ఎండీ ముషారఫ్ అలీ తెలిపారు. ఈమేరకు ఆయన సర్కిల్ స్థాయి అధికారులతో 2 రోజులు వర్చువల్, ఆన్ ఆఫీస్ పద్ధతిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈసారి 20 శాతం వరకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ, ఇప్పటి నుంచే ప్రణాళికను అమలు చేయాలని తెలిపారు.