NRML: ఖానాపూర్ మండలంలోని బీర్నంది జడ్పి పాఠశాలకు చెందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వ్యాసరచన పోటీలో పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. దీంతో వారికి ఎంపీఓ రత్నాకర్, సేవా సమితి మెంబర్ సత్తయ్య, పాఠశాల హెచ్ఎం జీఎల్వీ.ప్రసాద్, ఉపాధ్యాయులు సర్టిఫికెట్లు అందజేశారు.