SRPT: నాగారం మండలం ఈటూర్ గ్రామంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశ అభ్యున్నతికి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే, రాజ్యాంగంలోని హక్కులను పరిరక్షించడంలో జగ్జీవన్‌రామ్ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.