కృష్ణా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు గురువారం అవనిగడ్డలోని మండల టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాథ ప్రసాద్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఆదినారాయణ, బచ్చు రఘునాథ్, దాసినేని శ్రీను పాల్గొన్నారు.