NRML: నిర్మల్లోని ప్రసిద్ధ దర్గా హజరత్ మహమ్మద్ అబ్దుల్ అజీజ్ బాబా (వడూర్ బాబా) రహమత్ అలై ఉర్సు ఉత్సవాలు గురువారం సాయంత్రం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు అబ్దుల్ జబ్బర్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. సాయంత్రం 6 గంటలకు గంధం శోభయాత్ర నిర్వహించి హజ్రత్ వారి స్మృతి సమాధిపై పూలు చాదర్లు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు.