నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామ శివారులో గల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించారు. మాసోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.