పల్నాడు: నూజండ్ల మండల పరిషత్ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు. ఈసమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, జీవి ఆంజనేయులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని కోరారు.