అన్నమయ్య: రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం రామ్నగర్ నుంచి అత్తిరాల వరకు సుమారు 2000 మొక్కలను నాటారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు.