TG: దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్లో తన సంస్థను విస్తరించనుంది. పోచారంలోని క్యాంపస్లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దావోస్ వేదికగా ఇన్ఫోసిస్ CFO జయేష్ సంగ్రాజ్కా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. అనంతరం ఈ ప్రకటన చేశారు. ఫస్ట్ ఫేజ్లో ఇన్ఫోసిస్ రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాలు నిర్మించనుంది.