W.G: పెనుగొండ మండలం కొఠాలపర్రు శివారు వీరప్పచెరువు ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా బుధవారం తెల్లవారుజామున అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన 9 మందిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై కె.గంగాధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అశ్లీల కార్యక్రమాలను ప్రోత్సహిస్తే ఉపేక్షించేది లేదన్నారు.