కడప: ప్రముఖ వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని పులివెందుల పట్టణంలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పులివెందులలో డాక్టర్ గంగిరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.