WNP: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డైరక్టర్ యాస్మిన్ భాష అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కేడీఆర్ నగర్లో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని కిచెన్‌ను పరిశీలించారు. వంట సామాగ్రి నిల్వకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.