E.G: రాజమండ్రి రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు షేక్ సాజిద్ ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో నేతాజీ పాత్ర కీలకమన్నారు.