AP: ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోందని తెలిపారు. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈవోలు భారత సంతతికి చెందినవారేనని పేర్కొన్నారు. సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకున్న దేశంగా భారత్ ప్రయోజనాలు పొందుతోందని వెల్లడించారు.