AP: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. నిరంకుశ బ్రిటీష్ పాలనను ఎదిరించేందుకు తనదైన పంథాలో పోరాడిన దేశభక్తుడు నేతాజీ అని అన్నారు. స్వతంత్ర భారతావని కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యమని, దేశం కన్న ఏదీ మిన్న కాదు అన్న ఆ యోధుని స్ఫూర్తి ఎప్పటికీ అనుసరణీయమేనని పేర్కొన్నారు.