ప్రకాశం: ఎర్రగొండపాలెంలోని బాలికల వసతి గృహంలో విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఇన్ఛార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్స్ పంచారు. వసతి గృహంలో ఉన్న బాలికలకు ఫ్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి లోకేశ్ వసతి గృహాల మరమ్మతులు కోసం రూ.40 లక్షలు మంజూరని తెలిపారు.