KMR: లింగాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వహిందూ పరిషత్ (బజరంగ్ దళ్) ఆధ్వర్యంలో అయోధ్యలో బాల రామయ్యను ప్రతిష్టించి నేటికీ సంవత్సరం పూర్తైన సందర్భంగా స్వామి వారి దేవస్థానంలో అయోధ్య రామయ్య చిత్ర పటం వేసి దీపాలతో వెలిగించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. తాటి పాముల సంగీత, రాజు, సంజీత్ ఉన్నారు.