NLR: సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెల్లూరు డిపో నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ద్వారా రూ.1,11,66,421లు ఆదాయం చేకూరిందని జిల్లా ప్రజా రవాణా అధికారి మురళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 7డిపోల ద్వారా 394 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఆక్యుపెన్సీలో నెల్లూరు-2 ప్రథమ స్థానంలో నిలవగా, ఆత్మకూరు డిపో చివరి స్థానంలో నిలిచిందన్నారు.