CTR: 76వ భారత గణతంత్ర వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 26న నిర్వహించే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.