CTR: కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయాన్ని బుధవారం న్యాక్ పీర్ టీం సందర్శించింది. విశ్వ విద్యాలయ అధికారులు, అధ్యాపక బృందం న్యాక్ పీర్ టీం బృందానికి స్వాగతం పలికాయి. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను న్యాక్ టీం బృంద సభ్యులు సందర్శించారు. విద్యార్థులు, అధికారులు, అధ్యాపకులతో విడివిడిగా సమావేశమయ్యారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.