SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ నేడు ఉదయం 9.00 గంటలకు సరుబుజ్జిలి తెలికి పెంట నుంచి LPM అగ్రహారం వరకు తారురోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీ కార్యాలయంలో మునిసిపల్ సిబ్బందితో జరుగు రివ్యూ సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.