NLG: శాలిగౌరారం మండలం ఉప్పలంచ మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఉప్పలంచలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి తెలిపారు. ముందుగా వారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మల్లయ్య అంత్యక్రియలో పాల్గొనాలని కోరారు.