HYD: జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లకు మళ్లీ వరద మొదలైంది. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్కుల చొప్పున వరద వచ్చి చేరుతోంది. దీంతో వాటర్‌బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్ల ద్వారా 226 క్యూసెక్కుల, హిమాయత్‌సాగర్ రెండు గేట్ల ద్వారా 339 క్యూసెక్కుల నీటిని దిగువన మూసీలోకి వదులుతున్నారు.