మెదక్ పట్టణంలో పలు రేషన్ దుకాణాలను ఆదివారం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులోని రికార్డు వివరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని అన్నారు. ఎవరైనా రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.