SRD: సంగారెడ్డి పట్టణం శాంతినగర్‌లోని ఉపాధ్యాయ భవన్లో ఈ నెల 14వ తేదీన జరిగే విద్యాసదస్సు జయప్రదం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ కోరారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. సదస్సుకు పూర్వ మాజీ అధ్యక్షుడు వై. అశోక్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్ హాజరవుతారని చెప్పారు.