SRD: గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన బైండ్ల రమేష్ అనారోగ్యంతో మృతి చెందగా, అతని కుటుంబానికి మిత్రులు అండగా నిలిచారు. గుమ్మడిదల ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1998–99 బ్యాచ్ మిత్రులు రమేష్ భార్యకు రూ.1,32,100 ఆర్థిక సహాయం అందించి, ఆయన ఇద్దరు కుమారుల పేర్లపై ఎస్బిఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి తోడుంటామని భరోసా ఇచ్చారు.